Thursday, April 11, 2013

కూసంత.... హాస్యం....

వికసించిన  పువ్వులాంటి  పుట్టుక  ... వెదజల్లు పరిమళమే   ఈ జీవితం.. అలాంటి నా జీవితంలో... "కూసంత.... హాస్యం...." మీ కోసం..:-)              


              నాకు   జీవితంలో చాలా...ఇష్టమైన వాటిల్లో   ఆదివారం ఒకటి. ఆదివారం అనగానే ఏదో తెలియని  బద్ధకం, కాని.... నేను ఆ  రోజు కూడా ఎదో  ప్రొద్దున్నే  లేవాలనే అత్యాశతో అలారం 8 గంటలకె  పెట్టాను... అలా అని  మనకేమి ఇది కొత్త విషయం కాదు కదా! దాన్ని ఆఫ్ చేసి అంతే ఆవేశంగా టైమ్ దొరకనట్టు   నిద్రపోవడం..!  టైమ్  చూస్తే 10 గంటలు  అయింది, నేనే లేచాను అనుకుంటున్నారా ఏంటి.. ?అలా అనుకుంటే మీ పొరపాటే  నా ఫ్రెండ్ "బుజ్జిగాడు"  ఫోన్ కాల్ .... అ "దేవుడు" కి నాపైన ఎంత కోపం....? నేను నిద్రపోవడం చూసి అస్సలు తట్టుకోలేడు  ఎంతైనా మనం అ  "దేవుడు చేసిన మనషులు"మే కదా! ఈ ఒక్క సారి అ దేవున్ని క్షమించెస్తాలె. ఇంతకి మా వాడి ఫోన్ విషయం ఏంటంటే ... "ఎటో  వెళ్లి పోయింది మనసు" టికెట్స్ మాట్నీకి  బుక్ చేశానురా అని చెప్పాడు,నే సినిమా చూడకపోతే నాని,సమంత ఫీల్ అవుతారని  సరేరా అని చెప్పేసా. నేనేమో "బిందాస్"గా ఒంటి  గంటకు లేచాను నా రూంమేట్  "చింతకాయల రవి "గాడేమో 'నమ్మక తప్పని నిజమైన ....'  అంటూ "బొమ్మరిల్లు" సాంగ్ ప్లే చేస్తే నాకేమో అది   'నమ్మక తప్పదు   ఈ రోజు....ఇంత తొందరగా నే లేచానా.....'అన్నట్లుగా వినిపిస్తుంది... 
                
                 అప్పుడే  నా ఫ్రెండ్ "శత్రువు" గాడి ఫోన్, మేము "దిల్ సే " థియేటర్లో  వెయిట్ చేస్తున్నాము.. "స్వామీ రారా" అని ,నెనేమో  ఇక్కడ "గణేష్"  సెంటర్ లో  ఉన్నాను ఒక అరగంటలో మీముందు ఉంటారా అని ఏదో  "కథ" వినిపించా.. నానా అవస్థలు పడి "రెడీ" అయ్యి  "బస్ స్టాప్" లో ఓ పావుగంట  వెయిట్ చేస్తే .... అమ్మో అదేంటి  నాకు కావాల్సిన "143" నెం. బస్సు అపుడే వచ్చేసింది  నా జీవితంలో ఇదే మొదటిసారి కాబోలు ఇంత తొందరగా బస్సు రావడం ఈ రోజేదో  "అదృష్టం"  బావుంది అని నాలో నేననుకుంటూ బస్సు ఎక్కాను....అదేంటో మరి! "ప్రేమ కావాలి "  అనేంతల ఓ "అందాల రాక్షసి" నా కంటి ముందు మెరిసింది... ఇంతలో 'ఓ ప్రియా... ప్రియా....' అంటూ "ఇష్క్ "లో సాంగ్ నా మనసులో అలా  "అలా...మొదలైంది..... "దీనికి కారణం ఎంటా అని  ఆలోచిస్తే "ఎందుకంటే....  ప్రేమంట!" ...అ .. మరే!

                     మళ్లీ  ఎక్కడ ఉన్నావురా...?  షో టైం అవుతుంది అని..మంచి టైం కి నా ఫ్రెండ్స్  "జఫ్ఫా"స్  ఫోన్ కాల్స్.. అంతలో నా మదిని దోచిన "టక్కరి  దొంగ" మిస్ అయింది .... 'జీవితం అనే బస్ లో  ఎంతోమంది ఎక్కుతుంటారు... దిగుతుంటారు...'  అనే చిన్న  వేదాంతంతో సరిపెట్టుకుంటే "పోయే .. పోయే...లవ్వే... పోయే..." అంటూ పక్క వాడి ఫోనులో "ఆర్య-2" సాంగ్ రింగ్ టోన్ నన్ను వెక్కిరించినట్టుగా...! ఇంక నన్నునేను సముదాయించుకొని  థియేటర్ కు వెళ్ళాను... అక్కడ   Excuse me! కొంచెం సైడ్ ఇస్తారా...ప్లీజ్.... అంటూ వెనుకనుంచి ఓ అందమైన అమ్మాయి చూస్తే "గుండె ఝల్లుమంది"   నా "ప్రేమ దేశం"   యువరాణి మళ్లీ  నా కనుల ముందుకొచ్చింది,,, "నువ్వొస్తానంటే  నేనొద్దంటాన!" అని నా మదికి  అనిపించేలా..! ఇలాంటి మధురక్షణాలు మళ్ళి దొరకవు అన్నట్లుగా    నేను చిన్నగా అప్పుడే మాటలు కలిపాను  మా మద్య  మాటలు  బాగా కలిశాయి  ఎంతగా  అంటే...? "కుదిరితే కప్పు కాఫీ" అనేంతగా!  మూవీ  అయిన  తర్వాత  "సరదాగా కాసేపు" కబుర్లు చెప్పుకుంటూ కాఫీని ఎంజాయ్  చేస్తూ...."అవును"  ఇంతకీ  నీ పేరు ఏంటి అని అడిగింది.. ప్రేమ్  అని చెప్పాను  మరి నీ పేరు ప్రియ అని చెప్పింది.... "ప్రియ ప్రేమలో ప్రేమ్" బాగా సెట్ అయింది  కదూ!"100%లవ్"లో అంతే మరి!

                     ఇంతలో ఫోన్ మోగుతుంది.... చూస్తే ఫ్రెండ్ "ఏక్ నిరంజన్ " గాడు , 'ఏంట్రా ... బాబు! మద్యలో   నీ నస,,,,?' అనుకుంటూ ఫోన్ ఎత్తాను వాడేమో  షో టైం అవుతుంది తొందరగా  లేరా  బాబు..అన్నాడు, ఒక్కసారి  చుట్టూ  చూశాను..అమ్మో ! టైం చుస్తే మధ్యాహ్నం 1:30 అవుతుంది. అరె! నేనేమో  ఇంకా బెడ్ పైనే  ఉన్నానే...!ఓ  జరిగిదంతా  "స్వప్న లోకం"లోనా...  హ్హి..హ్హి.. హ్హి ...!  అపుడు ఇంకా నేనేమో 'నిజంగా... ఇదంతా.. కలనే.. అలా..నీతో..కాఫీ..తాగడం... .' అంటూ   "కొత్త బంగారు లోకం" లో  సాంగ్ ని రీమేక్ చేసి "కొంచెం ఇష్టం  కొంచెం కష్టం"గా పాడుకున్నా...నాలో నేను నవ్వేసుకుంటూ .....!  "ప్రేమలో పడితే " అంతేనెమో.."లైఫ్ is బ్యూటిఫుల్ " అనిపిస్తుందేమో!నిజంగా అలాంటి  "హ్యాపీ డేస్"  కోసం  ఈ "ప్రేమ లోకం"లో    నీరీక్షిస్తూ....మీ ప్రేమ్......      

                   

                

35 comments:

 1. బాగు బాగు :) ఇది చిత్రహారమేనా!! అంటే, చిత్రాల పేర్లతో అల్లిన హారం కదా :)) చాలా బాగా రాశావు కార్తీక్ అలియాస్ ప్రేమ్...

  ReplyDelete
  Replies
  1. చాలా...చాలా...థాంక్స్....ఇలాగె మీ అమూల్యమైన సలహాలతో నన్ను ప్రోత్సహించాలని....నా కోరిక

   Delete
 2. యూత్ ట్రెండ్ రుచి చూపెట్టావ్ ఇంతకీ నిద్ర లేచాకే ఈ పోస్ట్ వ్రాసేసారా? కలలోనా!!? :)

  ReplyDelete
  Replies
  1. వనజవనమాలి గారు చాలా కృతజ్ఞతలు....కొంచెం 'షాక్' లో పోస్ట్ చేశాను..మిస్టేక్స్ ఉంటె ఈ ఒక్కసారి..క్షమిoచండి..

   Delete
 3. ఆ అబ్బాయి చానా మంచోడు ..... కదా .. .. బాగుంది!!

  ReplyDelete
  Replies
  1. అవును అ అబ్బాయి నా కంటే మంచివాడు...చాల కృతజ్ఞతలు.....సాగర్ గారు..నా తొలి రచనలను ఇంతాగా ఆదరించినందుకు.....

   Delete
 4. ఆదివారం మీ కల "లవ్లీ" !

  ReplyDelete
  Replies
  1. ముందుగా నా బ్లాగ్ కు విచ్చేసినందుకు దన్యవాదములు... !చాలా థాంక్స్...'చిన్ని ఆశ'... కల మాత్రం ప్రతి ఒక్క యువతకు నిజం..కావాలని నా కోరిక..!

   Delete
 5. మొదటి పోస్ట్ లో స్వప్న లోకం..సినిమా పేర్లతో రాసారు టపా మొత్తం.
  చక్కటి టపాలతో మమ్మల్ని అలరించిండి
  మీ భ్లాగ్ పేరు బాగుంది.

  ReplyDelete
  Replies
  1. జలతారు వెన్నెల.. గారు..మీకు ముందుగా నే తెలుపుకుంటున్నాను సవినయంగా స్వాగతం...మీమ్మల్ని నా స్టొరీ అలరించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది..థాంక్స్...అలాగే నా బ్లాగ్ పేరు మీరు మెచ్చినందుకు...దన్యవాదములు...

   Delete
 6. Wonderful:) "పరిచయం" బావుంది. ఇవాళే చూసాను.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అనూ..గారు...మీ అభినందనకి... పరిచయాన్ని మెచ్చినందుకు...మళ్లీ ఒక్కసారి థాంక్స్...

   Delete
 7. Replies
  1. థాంక్స్...చాతుర్య గారు....

   Delete
 8. చాలా బాగుందండీ మీ బ్లాగ్. మీ బ్లాగ్ పేరు కూడా :)

  ReplyDelete
 9. ఈ వర్డ్ వెరిఫికేషన్ తీసేయొచ్చు కదండీ? నేనూ మొదట్లో తెలియక పెట్టుకున్నాను, వర్డ్ వెరిఫికేషన్ అంటే విసుగొచ్చి కామెంట్ చేసేవారు కాదు. తరువాత ఫ్రెండ్ ఒకరు చెబితే తీసేసాను :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్...ప్రియ గారు..అలాగే నా బ్లాగ్ కు స్వాగతం..
   ఇంత వరకు మీరు చెప్పేవరకు నాకు ఈ వర్డ్ వెరిఫికేషన్ గురించి తెలియదు...once again thanks for your advice.....

   Delete
 10. mi tapaa chaalaa baavundi saradaagaa cinimaa perla to....:)

  ReplyDelete
 11. ఎగిసే అలలు... కు స్వాగతం.. నా టపా మీకు సరాదగా థాంక్స్..చెబుతుంది....

  ReplyDelete
 12. Replies
  1. థాంక్స్..మాలా కుమార్ గారు.. ఎగిసే అలలు బ్లాగు కు స్వాగతం...

   Delete
 13. సినిమా పేర్లతో మీరు చేసిన గారడీ బాగుంది మాస్టారు బాగు ..బాగు .మంచి టపా

  ReplyDelete
  Replies
  1. Navajeevan garu.. Thanq so mucccchhhh....
   welcome to "egise alalu..":-):-)

   Delete
 14. మీ బ్లాగ్ ని ఇప్పుడే చూస్తున్నా.ఈ పోస్ట్ చాలా బాగుందండి.పోస్ట్ లు ఆపేశారేంటి?

  ReplyDelete
  Replies
  1. Mohana gaaru... Chaalaaa chaalaa thanq:-)
   welcome to "egise alalu.."

   Delete
 15. బాగుందండి పోస్ట్ సరదాగా ఉంది

  ReplyDelete
 16. ఇన్ని సినెమాలు ఎలా తెలుసండీ!!!!!

  ReplyDelete
 17. Superb boss- Sri raj

  ReplyDelete
 18. Add your blog:
  www.blogvedika.blogspot.com

  ReplyDelete