Wednesday, September 3, 2014

మళ్ళీ మళ్ళీ


 
పసితనపు చెట్టుకొమ్మకు వ్రేలాడదీసిన
తీపి జ్ఞాపకాల ఊయలపై
హాయిగా ఊగుతున్న నా మనసుపై
ఎన్నో కలలు హత్తుకుపోతున్నాయి.

నిదురపోయే వేళకి
ఆరుబయటున్న నానమ్మ మంచంలోకి
వాలిపోయి కథలు చెప్పిచ్చుకున్న
మరెన్నో రాత్రుల గురుతులు
నా మనసును వెంటాడుతున్నాయి.

ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నప్పుడు
ఎంతో ఆశను నింపుకున్న
ఆ అమాయకపు చూపుల్లోని కాంతులు
ఇంకా నాలో వెలుగుతూనే వున్నాయి.

"ఈ అనుభూతులన్నీ అందమైన బాల్యాన్ని
తిరిగి తీసుకు రాలేకపోవచ్చేమో! కానీ,
అప్పటి లేలేత అనుభవాలన్నింటినీ 
మళ్ళీ మళ్ళీ మన మనోలోకాల్లోకి తెస్తుంటాయ"ని,
గోడపై  పూలదండేసున్న ఫొటోలోంచి
నానమ్మ నవ్వుతూ చెబుతున్నట్లనిపిస్తుంది.
 

2 comments:

  1. "ఈ అనుభూతులన్నీ అందమైన బాల్యాన్ని
    తిరిగి తీసుకు రాలేకపోవచ్చేమో! nijame

    ReplyDelete