Thursday, October 23, 2014

దీపావళి



ప్రతీ విజయపు గగనంలో
భానుడిలా వెలుగులు పంచుతూ,
చంద్రుడిలా వెన్నల హాయిని అందిస్తూ,
మదినిండా ఆనందపు దీపాలను
వెలిగించే పండుగే దీపావళి.

సత్యభామ నరకుడ్ని చంపినపుడు,
రావాణాసుడు సీతాపహరణంచేత
రాముని చేతిలో ప్రాణాన్ని కొల్పోయినపుడు,
ఆధర్మం ధర్మం చేతిలో ఓడినపుడు,
ఘనంగా జరుపుకునే వేడుకే దీపావళి.

ఇంటింటా సంతోషపు అంబరాన్ని తాకేలా,
కేరింతలు,చిరునవ్వులు,వెలుగుల మూటలు,
నూతన వస్త్రాలు,పూజలు ప్రసాదాలూ,
మరెన్నో ఒక్కసారిగా తెచ్చే సంబరం దీపావళి.
 

Sunday, October 19, 2014

వెన్నల సంతకం

 

రాతిరి వేళ ఆకాశమంతా
విరబూసిన చుక్కలు కురిపించే
పసిడి వెలుగులలో తడుస్తున్నప్పుడు
అనుభూతుల వేణువేదో
కొంగొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది.

అలాంటప్పుడు,

ఆ మధుర క్షణాల మీద
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది.

ఎప్పుడూ గీయని కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది.

ఎన్నడూ వినని వెన్నల  పాటేదో
మనసు గొంతులో
హాయిగా పాడుకుంటుంది.

చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.

ఆ తుమ్మెద ఝుంకారమే
నా మనసుపలికే మౌనరాగం.
ఎన్నటికీ చెరగని వెన్నల సంతకం.