Sunday, June 21, 2015

రెండురూపాయల కథ

        హాయ్ ఫ్రెండ్స్..అందరూ ఎలా ఉన్నారు?నాకు తెలిసి ఇప్పటి వరకు బాగానే ఉండుంటారు. పోస్ట్ చదివిన తర్వాత మాత్రం మీ పరిస్థితి మారిపోవచ్చు.అయ్యో భయపడిపోకండి,ఏదో సరదాగా అనేశాను.అసలు విషాయానికి వస్తే మధ్య కథ రాసి చాలా కాలం అయ్యిందని నాకు నేనుగా భావించి, రోజు ఏం చేసైనా ఏదో  ఒకటి రాసేయాలని కంకణం కట్టుకున్నా.(కొంచెం ఆవేశం ఎక్కువయినట్టుందిరా కార్తీక్, ఘాటు కాస్త తగ్గిస్తే బావుంటుందిరా-:)).ఏం రాయాలని అలోచించుతా ఉంటే నా మట్టి బుర్రకు ఒక బమ్మాండమైన ఆలోచన తట్టింది.అది ఏమనగా అధ్యక్షా.. నా చిన్నప్పటి అనుభవాల్నే కథగా మలిస్తే భావుంటుందని అనిపించింది.అలా భయభ్రాంతులై చూడకండి.సినిమాల్లోలాగా చిన్నప్పుడే ఎవర్నో హత్య చేసి జైలుకెళ్ళడం కానీ,అసలు ప్రేమంటేనే అర్ధంకాని వయసులో కూడా ఘాడంగా ప్రేమించిన అమ్మాయి విడిపోవడం లాంటి బాక్గ్రౌండ్ నాకు లేదని  మీకు గట్టిగా హమీ ఇస్తున్నా.ఇక ఇప్పుడు మీరు ధైర్యంగా,నిర్భయంగా,నిస్సందేహంగా పోస్ట్ చదవచ్చు.

కథ మొదలయింది..

        అనగనగా ఒక రోజు కార్తీక్ అనబడే నేను, ఎప్పుడూ అలవాటులేనిది పొద్దున్నే లేచి స్నానం చేసి,పాత బట్టలే వెసుకుని (కొత్త బట్టలు సారి డబ్బుల్లేవని అమ్మ కొనలేదు.) అమ్మ చేసిన పాయసాన్ని పట్టుకుని తాతయ్య వాళ్ళింటికి వెళ్ళాను.ఇప్పడికైనా అర్ధమైందా రోజు నా పుట్టిన రోజు.(అందరూ నన్ను విష్ చెయ్యండి మరి!).నేను ఊహించించిన విధంగానే తాతయ్య జేబులోంచి నాకు రెండు రూపాయలు వచ్చాయి.ఇకప్పుడు నా ఆనందానికి పట్టపగ్గాల్లేవంటే మీరు నమ్మరు. నేనయితే ఒక్కరోజులోనే కోటిశ్వరడుని అయ్యినట్టు రెండు రూపాయాలను పదేపదే చూసుకుంటూ, రోజు కొట్టుకెళ్ళి ఏం కొనుక్కోవాలో లిస్ట్  రాసుకుంటున్నా .పావలా బిస్కేట్లు, అర్ధ రూపాయి చాక్లెట్లు,ఇంకో పావలానేమో పల్లీపట్టీ, మిగాతా రూపాయితో రేపు కొనుకోవచ్చని అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నా.

    చకచకా ఇంటికొచ్చి బయటికెల్తున్నా అని అమ్మతో చెప్పి,సీతమ్మమ్మ కొట్టుకి పరుగెత్తుకుంటూ వెళ్ళా.సీతమ్మమ్మ చాలా మంచావిడ.ఎవరి మీదా అధారపడకుండా  తనకున్న కాస్త డబ్బుతోనే చిన్న కొట్టు పెట్టుకుని జీవితాన్ని ఎల్లదీస్తుంది.నేనంటే అమ్మమ్మకి చాలా ఇష్టం.కొడుకులు వదిలేసినా కూడా తన ఆత్మగౌరవాన్నే నమ్ముకుని బ్రతుకు సాగిస్తుంది.క్షమించాలి కథనెక్కడికో తీసుకెల్తున్నా, మళ్ళీ నా రెండురూపాయల విషాయనికొస్తే.. కొట్టు ముందు దర్జాగా నిల్చుని డబ్బాల వైపు చూస్తూ ఏం కొనాలో అలోచించుతా ఉన్నా.
అమ్మమ్మ నా వైపు నవ్వుతూ చూస్తూ "ఏరా చిన్నా రోజు ఇంత పొద్దున్నే వచ్చావెంట్రా?"అని అడిగింది.
" రోజు నా పుట్టిన రోజు అమ్మమ్మ.మా తాతయ్య నాకు రెండు రూపాయలిచ్చాడు.వాటితో ఏం కొనలా అని చూస్తున్నా"
"అవునా,నువ్వు నూరేళ్ళూ ఇలానే నవ్వుతూ ఉండాలిరా"అని ఆశీర్వదించింది.
నేను నా రెండు రూపాయల కోసం జేబులో చేయి పెట్టా అంతే నా గుండె ఢమాల్ అంది.నా జేబుకు అడుగున చిరిగిపోయి ఉంది.కొత్త బట్టలు కావు కదా.
"ఎంట్రా వెదుకుతున్నావు?"
"అమ్మమ్మా,నా దగ్గరున్న డబ్బులు కనిపించడం లేదు.పోయాయి."అంటూ బిక్కమొకం వేసుకున్నా.
"పిచ్చొడా,దానికెందుకురా బాధపడతవు?నీకెంకావాలో తీసుకోరా,నేను మాత్రం అమ్మమ్మని కాదూ?నా మనవుడికి పుట్టినరోజున ఏం ఇవ్వకుండా ఉంటానా." అంటూ నన్ను దగ్గరకు తీసుకుని నాక్కావల్సినవి చేతికిచ్చింది.
నేను మాత్రం ఏడవడం మొదలుపెట్టాను.
"ఇంకా ఎందుకేడుస్తున్నావ్ చిన్నా? రోజు నువ్విలా ఏడవకూడదు"అంటూ బుజ్జగిస్తుంది.
"నేను ఏడుస్తుంది నా డబ్బులు పోయాయని కాదమ్మమ్మ,అమ్మ చేసిన పాయసం నీకోసం తేనందుకు."అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాను.
అంతే!
సీతమ్మమ్మ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.

8 comments:

  1. బాగుంది మీ పోస్ట్

    ReplyDelete
  2. జ్ఞాపకాల వెల్లువ తో కూడిన కథా ప్రవాహం ...బగుంది..ఓ నిమిషం మనసును కదిలించింది..

    ReplyDelete